calender_icon.png 21 November, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

16-08-2024 07:44:14 PM

మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 338 మంది లబ్ధిదారులకు రూ.కోటి 5 లక్షల 8 వేల 8 వందల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.