calender_icon.png 21 November, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యురాలి హత్య.. పార్టీలకు ప్రజలకు పట్టింపు లేదు

16-08-2024 08:16:09 PM

సిద్దిపేట: ఇతర దేశాలలో భారతదేశంలో జరుగుతున్న దాడుల గురించి నిరసనలు చేస్తున్న భారతీయులకు మనదేశంలో ఒక ఆడపడుచుకు జరిగిన అవమానాన్ని పట్టించుకునే ఇంకింత జ్ఞానం లేకుండా పోయిందని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు మండిపడ్డారు.  శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ముస్తాబాద్ చౌరస్తా విక్టరీ చివరస్త బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్దకు ర్యాలీగా వచ్చారు.  సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సురభి వైద్య కళాశాల విద్యార్థులు బిజేఆర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చారు.

రెండు కళాశాలల విద్యార్థులు వైద్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైద్యులపై జరుగుతున్న అఘాయిత్యాలను నాటిక, నృత్యం రూపంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు చూస్తున్న వారందరినీ కంటతడి పెట్టించే విధంగా చేశారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యులు వైద్య విద్యార్థులు మాట్లాడుతూ... భారత దేశంలో ఉన్న ఆడపడుచులకు రక్షణ లేదు అనుకుంటే ప్రాణం పోసే వైద్యులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన దుర్మార్గులను తక్షణమే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్య వృత్తికి భద్రత లేకుండా పోతుందని వాపోయారు.

వైద్య విద్య నేర్చుకునేటప్పుడే చేస్తున్న ప్రమాణస్వీకారానికి కట్టుబడి ఉండే వైద్యులు వారి వద్ద ఉన్న మారునాయుధాలను ప్రాణం పోసేందుకే వాడుతారని చెప్పారు. పోలీసుల వద్ద తుపాకీలు ఉండే కన్నా వైద్యుల వద్ద కత్తులు ఉంటాయని నిజాన్ని దుర్మార్గులు గ్రహించాలని సూచించారు. దేశ ప్రజలు వైద్యులకు మద్దతుగా నిలవాలని ప్రార్థించారు. సో కాల్డ్ రాజకీయ నాయకులు అన్నీ మూసుకుని ఉన్నారని చెప్పారు. ఈ దుర్మార్గమైన ఘటన వారి ఆడపడుచులకు జరగకూడదని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. తమకు భద్రతా ఉందన్న నమ్మకం కలిగేంతవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామంటూ చెప్పారు. ఈ సందర్భంగా మహిళ జూనియర్ వైద్యులకు వైద్య విద్యార్థులకు రాఖీ కానుకగా పురుష వైద్యులు వైద్య విద్యార్థులు పెప్పర్ స్ప్రే ని బహుమతిగా అందించారు.