calender_icon.png 4 November, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి పట్టణంలో బంగారం చోరీ

04-11-2025 10:53:56 AM

మూడున్నర తులాల బంగారు అపహరణ

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని(Kalwakurthy town) సుభాష్ నగర్(Subhash Nagar)లో లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. వంగూరు మండలం పోల్కంపల్లి కి చెందిన లక్ష్మణ్ గౌడ్, కల్వకుర్తిలో నూతనంగా ఇంటిని కొనుగోలు చేశాడు. సోమవారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి బంధువులందరూ కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి కాంపౌండ్ కూడా పైనుండి దూకి లోపలికి వచ్చాడు.

మెయిన్ డోర్ పక్కన ఉన్న కిటికీ తెరిచి ఉండడంతో అందులోనుండి చేయి పెట్టి డోర్ గడియ అని తీశాడు. మెయిన్ హాల్లో గృహప్రవేశం సందర్భంగా ఏర్పాటుచేసిన దేవుని బొమ్మల మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్ళాడు. వెంటనే తేరుకుని ఆమె కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దొంగ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.