calender_icon.png 26 May, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా చెరువు మట్టి.. నీటి తరలింపు

25-05-2025 11:21:53 PM

జేసీబీతో ఆర్ & బీ రోడ్ అస్తవ్యస్తం.. 

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనాజీపురంలోని గాండ్ల చెరువు (సూర్యాపేట పట్టణ ప్రజలకు దాహర్తిని తీర్చే రిజర్వాయర్) నుంచి అక్రమంగా మోటర్లు బిగించి కిలోమీటర్లు దూరంలో ఉన్న వ్యవసాయ భూములకు ఆర్ & బీ రహదారిని జేసీబీతో అస్తవ్యస్తంగా తవ్వి నీటి తరలింపుకు ప్రయత్నాలకు కొందరు రైతులు బీజం వేశారు. అలాగే ఇదే గ్రామంలో ఉన్న మేళకుంట చెరువులో పదుల కొద్దీ అక్రమంగా బావులు తవ్వినా, పైపులైన్లు వేసి అక్రమ విద్యుత్ లైన్లు తీసి నీటిని తరలిస్తున్నారని గ్రామస్తులు, ఆయకట్టు రైతులు మొర పెట్టుకున్న పత్రికలో శీర్షికలు వచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తుల నుంచి అధికారులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

కాగా ఆదివారం కొందరు అక్రమంగా జేసీబీ, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నా.. అధికారులకు సమాచారం అందించిన విషయం తెలియపరిచే లోపే ఆదివారం రోజు కూడా మీటింగ్ లో ఉన్నామని ఫోన్ కట్ చేసారని గ్రామస్తులు విలేకలకు మొర పెట్టుకున్నారు. ఇప్పటికయినా ఉన్నతాధికారులు స్పందించి మట్టిని, ఆర్&బీ రోడ్ ను తవ్వి.. చెరువులో అక్రమంగా బావులు తీసి మోటర్లు బిగించిన వారిపై.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. లేని యెడల ఉద్యమాలు చేస్తామన్నారు.