26-05-2025 12:02:40 AM
టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేనీ ముజీబ్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రి జిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటామని టీ ఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ హు స్సేని ముజీబ్ పేర్కొన్నారు. టీఎన్జీఓస్ యూ నియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రి జిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా కా ర్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీ ఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ హు స్సేనీ ముజీబ్, తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉ ద్యోగుల సంఘం అధ్యక్షుడుజగన్నాథం ప్ర వీణ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భ ంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్ర భుత్వ నిబంధనలకు కట్టుబడి, పైఅధికారుల సూచనలు పాటిస్తూ రాష్ట్రానికి ఆదాయం తీ సుకొచ్చే శాఖలలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఒకటని, ఈ శాఖలో మేము చాలా బా ధ్యతయుతంగా పనిచేస్తామని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
దీనిపై టీఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్సేనీ ముజీబ్ స్పందిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిచ్చొద్దంటూ త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్‌ని కలిసి విన్నవించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోతె శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు మధుకర్, సమీయుద్దీన్, నరేశ్, నాగరాజు, నాగేశ్, జగన్, అన్వర్, ఇంద్రారెడ్డి, లక్ష్మణ్, రవీందర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.