calender_icon.png 12 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు.. పట్టపగలే రవాణాలు

12-11-2025 06:59:50 PM

అనుమతులు ఎవరికీ ఇవ్వలేదు.. మైన్స్ ఎడి

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుక అక్రమ తవ్వకాలను జరుపుతూ పట్టపగలే తోడేస్తూ... అక్రమ రవాణాకు సైతం తెగబడుతున్నారు. యాలాల మండలం కోకట్ కాగ్న నది నుండి బుధవారం కొందరు అక్రమార్కులు యథేచ్చగా దాదాపు 5 నుండి 6 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తోడేస్తూ రవాణా చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ విషయమై సంబంధిత ఘనులు భూగర్భ శాఖ ఏడి, సత్యనారాయణను వివరణ కోరగా ఇసుక అనుమతులు ఎవరికి ఇవ్వలేదని.. అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.