13-11-2025 12:00:00 AM
అనుమతులు ఎవరికీ ఇవ్వలేదు: మైనింగ్ ఏడి
తాండూరు, నవంబర్ 12: వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుక అక్రమ తవ్వకాలను జరుపుతూ పట్టపగలే తోడేస్తూ...అక్రమ రవాణాకు సైతం తెగబడుతున్నారు. యాలాల మండలం కోకట్ కాగ్న నది నుండి బుధవారం కొందరు అక్రమార్కులు యదేచ్చగా దాదాపు 5 నుండి 6 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తోడేస్తూ రవాణా చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ విషయమై సంబంధిత ఘనులు భూగర్భ శాఖ ఏడి, సత్యనారాయణను వివరణ కోరగా ఇసుక అనుమతులు ఎవరికి ఇవ్వలేదని.. అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.