calender_icon.png 13 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

13-11-2025 12:00:00 AM

కౌంట్‌డౌన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఈఐఎల్‌డైరెక్టర్, సేవా కార్యక్రమాల ప్రముఖురాలు సుధారెడ్డి, ప్రపంచ తెలుగు ఐటీ సదస్సు (డబ్ల్యూటిఐటిసి) ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా కలిసి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు-2025 కౌంట్‌డౌన్ పోస్టర్‌ను హైద రాబాద్‌లోని టి-హబ్‌లో బుధవారం ఆవిష్కరించారు.

డిసెంబర్ 12-14 తేదీలలో యు నైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ ఐటీ మహాసభకు 100 కంటే ఎక్కు వ దేశాల తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘డబ్ల్యూటిఐటిసి-2025 దుబాయ్ కాన్ఫరెన్స్ మన గ్లోబల్ ప్రతిభ, ఇన్నోవేషన్, కలబోరేషన్‌కు వేదికగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు ఐటీ మిషన్కు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’ అని తెలిపారు.

సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. డబ్ల్యూటిఐటిసి- 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నాలజీ నిపుణులు, ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్లు ఒక్క జెండా కింద ఏకం అవుతారు. ఇది గ్లోబల్ టెక్ కథనాన్ని కొత్త దిశలో మలుస్తుంది’ అని అన్నారు. దుబాయ్ ఎడిషన్‌లో ఏఐ, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడతాయి.

అలాగే డబ్ల్యూటిఐటిసి గ్లోబల్ ఇన్వెస్టర్ పిచ్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎక్స్‌పో, విమెన్ ఇన్ టెక్ సమ్మిట్, అలాగే 2026- 2028 గ్లోబల్ లీడర్షిప్ టీమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటిఐటిసి సభ్యులు యమిని, మనసా, అక్షిత సింగారం, ప్రణవ్ పాల్గొన్నారు. వివరాకలు ఇండియా 81231 23434, యుఏయీ +971 56577 8923 నంబర్లలో సంప్రదించవచ్చు.