ఓల్డ్ బోయిన్‌పల్లిలో అక్రమ షెడ్లు నిర్మాణం
అధికార పార్టీ నాయకుల పేరుతో చెలరేగిపోతున్న నిర్మాణదారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
సికింద్రాబాద్, జూలై 23 (విజయక్రాంతి): పిల్లి గుడ్డిది అయితే.. ఎలుక ఏదేదో ఎత్తేత్తి చూపించందట చందనంగా ఓల్ బోయిన్ పల్లి డివిజన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహారం. ఓల్ బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఓల్ బోయిన్ పల్లి సర్కిల్ పరిధిలోని కళ్యాణి థియేటర్ వెళ్లే రోడ్డు శీను టీ పాయింట్ వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణదారులు ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారు.
అలాగే ఓల్ బోయిన్ పల్లి మెయిన్ రోడ్ లో రెండు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకుని అక్రమంగా అదనపు ఫ్లోర్లు నిర్మాణం చేపడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇవేమీ కనబడటం లేదా.. అధికార పార్టీ ముఖ్య నాయకుడి పేరు చెప్పుకుంటూ, అక్రమ నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతు న్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంద రు అక్రమ నిర్మాణదారులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ నిర్మా ణాలే తమ ధ్వేయంగా ముందుకువెళ్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల పేర్లతో అక్రమాలు..
సదరు అక్రమ నిర్మాణదారులు ఓ పార్టీ ముఖ్య నాయకుడి పేరు చెప్పుకుంటూ అక్రమంగా షెడ్లు, అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమాల పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని ఎంఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తునప్పటికీ కొందరు అక్రమ నిర్మా ణదారులు మాత్రం అవేమి పట్టకుండా ఇష్టారాజ్యంగా అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
అనుమతులు లేకుండా, నిర్మిస్తున్న అక్రమ షెడ్ల పట్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందేమోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్రమ షెడ్ల పై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గొడమే కాకుండా, అమ్యామ్యాలకు అలవాటు పడి లక్షల్లో దండుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి అక్రమ షెడ్లకు అడ్డుకట్ట వేసి,ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






