24 July, 2026 | 3:21 AM

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

24-07-2026 12:00 AM

రాజేంద్రనగర్, జూలై 23 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నానక్రామ్గూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మబ్బు విష్ణువర్ధన్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం, విష్ణువర్ధన్ రెడ్డి ప్రముఖ ఐటీ సంస్థ జేపీ మోర్గాన్ ఛాయిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 22న విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన అనంతరం తన గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు.

23వ తేదీ తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీ లించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని నార్సింగి పోలీసులు తెలిపారు.