17 March, 2026 | 6:28 AM

మోదీ తీరే ధరల పెరుగుదలకు కారణం

17-03-2026 12:12 AM

సీపీఐ నిరసన కార్యక్రమంలో బాగం

ఖమ్మం /రఘనాథపాలెం : మార్చి 16(విజయక్రాంతి ):ట్రంప్ యుద్ధ కాంక్ష భారతదేశంలో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. గ్యాస్ ధరలతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణిస్తున్నాయని ఆయన తెలిపారు. గ్యాస్ సహా ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు. ధరలను తగ్గించాలని కేంద్ర విధానాలే ధరల పెరుగుదలకు కారణమని నినదించారు.

ఈ ఆందోళను ఉద్దేశించి హేమంతరావు మాట్లాడుతూ సంపదపై కన్నెసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపన్న దేశాలపై దాడులు చేసి అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ క్రమంలోనే ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇర్పా దాడులు చేస్తున్నారన్నారు. మోడీ అలీన దేశపు ప్రధానిగా యుద్ధాన్ని నివారించకపోగా యుద్ధం వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను అంచనా -వేయడంతో వైఫల్యం చెందారని ఆయన ఆరోపించారు. దిగుమతుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగానే ధరలు పెరిగాయని హేమంతరావు తెలిపారు.

ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలన్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేసే వాటి ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. యుద్ధం ఆగకపోతే రసాయనిక ఎరువుల ధరలు పెరగడంతో పాటు కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని తక్షణం ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మోడీ ట్రంప్ ముందు మోకారిల్లుతూ దేశ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, కార్పొరేటర్ బిజి క్లెమెంట్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేష్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పుచ్చకాయల సుధాకర్, గాదె లక్ష్మి నారాయణ, నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, బానోత్ రాంకోటి, ఎస్కె సైదా, మడుపల్లి లక్ష్మణ్, శ్రవణ్, చింతల రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.