30-01-2026 12:06:45 PM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ కు నమ్మదగిన సమాచారం మేరకు ఫతేపూర్ గ్రామ శివారులో బ్రిడ్జి దగ్గర పిట్లం నుండి వస్తున్న ఒక లారీ నెంబరు AP16TY0055 గల దానిని పట్టుకొని అందులో అక్రమంగా తరలిస్తున్న 190 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రవి గౌడ్ తెలిపారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీను తనిఖీ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశామని తెలిపారు.