calender_icon.png 30 January, 2026 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దానం అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ

30-01-2026 11:24:06 AM

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) శుక్రవారం విచారణ ప్రారంభించారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారిస్తున్నారు. కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతరులు వేసిన అనర్హత పిటిషన్లపై విచారిస్తున్నారు. ఇవాళ పిటిషనర్ల వాదనలు విని సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేయనున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. పెండింగ్ ఉన్న 3 అనర్హత పిటిషన్లపై గతంలోనే సుప్రీంకోర్టు వివరణ కోరింది. విచారణ జరిపి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశించింది. స్పీకర్ కార్యాలయం  అనర్హత పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరఫున కౌశిక్ రెడ్డి న్యాయవాదులు, దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు విచారణకు హాజరయ్యారు.