13-03-2025 02:07:28 AM
మంథని ఎస్‌ఐ డేగ రమేశ్
మంథని మార్చి 12విజయ క్రాంతి) మండలంలోని సిద్ధపల్లి గ్రామంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిల్వ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్‌ఐ డేగ రమేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిల్వ చేశారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ తో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద సింగరేణి వారు స్వాధీనం చేసుకున్న సిద్దపల్లి గ్రామంలో ఒక ఇంట్లో తనిఖీ చేయగాక అందులో 106 ప్లాస్టిక్ సంచులలో 54.40 క్వింటాల పిడిఎస్ బియ్యం ఉన్నాయని,
ఈ బియ్యం అక్రమంగా నిల్వచేసిన అతని ఎండి రియాజ్ సిద్ధపల్లి కు చెందిన అతనిని విచారించగా, తను రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముతానని తెలిపాడని, అతనిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.