calender_icon.png 24 August, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దవాఖానకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి

24-08-2025 01:30:57 PM

సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలోని పల్లె దవాఖానకు విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె దవాఖానకు విద్యుత్ కనెక్షన్ లేక వైద్య సిబ్బంది, అక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఎంతోమంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ వైద్యాన్ని గాలికి వదిలేసి పట్టించుకోని పాలకులారా ఇప్పటికైనా స్పందించాలని ఆయన అన్నారు.