24-08-2025 02:47:41 PM
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజకీయ పార్టీలు ఇచ్చేది కాదని రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఇవ్వాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్(BC Student Union District President Aithagoni Janardhan Goud) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్లబొల్లి మాటలు చెప్పి బీసీలను మభ్య పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని బీసీలకు మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని మా వాటా కోసం ఎంతటి పోరాటానికైనా బీసీ సమాజం సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీ బిల్లుల అమలు విషయమై ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటం కూడా చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగులో వున్నాయని ఆ బిల్లులను వారు తిరస్కరించడం గాని ఆమోదించడం గాని చేయలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ ,గద్దల మధు ,దన్నంపల్లి హరీష్ ,కాడ శివ, కీసర నరేష్ ,మొగిలిచర్ల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.