calender_icon.png 24 August, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర

24-08-2025 03:40:57 PM

హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. సురవరం భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కామ్రేడ్.. అమర్ రహే.. అంటూ సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. మగ్దూం భవన్ నుంచి మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర కొనసాగింది. సురవరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. కాగా, సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రోజున గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిపిందే.