24-08-2025 04:00:13 PM
చిట్యాల (విజయక్రాంతి): పాముకాటుకు వివాహిత మృతిచెందిన సంఘటన చిట్యాల మండలం(Chityal Mandal) తాళ్ల వెల్లంల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన షేక్ షాహిన్(39) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె ఎడమ కాలుపై పాము కాటు వేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అదే సమయంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ వెంటనే మృతి చెందింది. తన భర్త షేక్ సలీం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నమోదు చేసి పంచనామ నిర్వహించామని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు.