13 March, 2026 | 1:50 AM

కారుతో ఢీకొట్టి ఇమ్మడి గోపిపై కత్తులతో దాడి అక్కడికక్కడే మృతి

13-03-2026 12:12 AM

సిరికొండ, మార్చి 12.   (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి గోపీ నీ (55) బుధవారం రాత్రి గత దారుణంగా హత్య చేశారు. గత రాత్రి సుమారు 10 గంటల సమయంలో గౌరారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని సబ్స్టేషన్ సమీపంలో లింగాపూర్ గ్రామానికి చెందిన దగ్గిర సతీష్ తన కారుతో ఢీకొట్టాడు.

అనంతరం కారులో నుంచి దిగిన సతీష్తో పాటు మరికొందరు వ్యక్తులు గోపిని బయటకు లాగి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన గోపీ అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య ఇమ్మడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇండల్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.