11 April, 2026 | 3:53 AM

దోమల నివారణకు తక్షణ చర్యలు

11-04-2026 01:53 AM

ఎమ్మెల్యే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్/నాగోల్, ఏప్రిల్ 10: ఎల్బీనగర్ నియోజకవర్గంలో దోమల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు సొంత నిధులతో కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాలను ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... కొన్ని రోజులుగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రోన్ల సాయంతో చెరువుల్లో దోమల నివారణకు రసాయన మం దులు పిచికారీ చేయాలని సూచించారు. చెరువుల్లో పెరుకుపోతున్న గుర్రపుడెక్క ఆకును తొలిగించాలన్నారు. దోమల కారణంగా  మలేరి యా, డెంగీ జ్వరాలు వస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్లు, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.