ప్రవేట్ కోచింగ్ లను ఆపాలి
08-06-2026 05:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ లో నిర్వహిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డిసెంబర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా నవోదయ సైనిక గురుకుల కోచింగ్ నిర్వహిస్తూ హాస్టలను నిర్వహిస్తూ పేద ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.






