పంటల బీమా పథకాన్ని తక్షణమే ఏర్పాటు చేయండి
బెజవాడ రవి సీపీఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం నాయకులు
మధిర,జూన్ 22(విజయ క్రాంతి): రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి తక్షణమే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రైతు సంఘం నాయకులు బెజవాడ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మధిర మండల సమితి ఆధ్వర్యంలో తాసిహల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... డీజిల్, పెట్రోల్, ఎరువులు ధరలు పెంచి రైతులు ప్రజలపై తీవ్రమైన భారం మోపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులు, ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల పైనున్న పంట రుణాలను మాఫీ చేసి రైతు భరోసా, పంట పెట్టుబడి సహాయం మొత్తం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాల వ్యాపారస్తులను కఠినంగా శిక్షించి నాణ్యమైన విత్తనాలు ఎరువులు రైతులకు అందించాలని బెజవాడ రవి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకులు యం ఏ రహీం, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పంగా శేషగిరి, నాయకులు ఊట్ల కొండలరావు, పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, రామానుజం, శ్రీను, కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






