కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ చీరల పంపిణీ
కూకట్‌పల్లి, జూన్ 22 (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ కాలనీ 4వ పేస్ కమ్యూనిటీ హాల్‌లో సోమవారం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టిపిసిసి ఉపాధ్యక్షుడు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఇందిరమ్మ చీర లు ప్రతి నిరుపేద మహిళకు అందేలా చూ డాలని ఎమ్మెల్యే సూచించారు.
బండి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనే క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని మహిళలు ఆర్థికం గా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళ లు, తదితరులు. పాల్గొన్నారు.






