calender_icon.png 30 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు దుర్మార్గం

30-08-2025 12:21:24 AM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్,ఆగస్టు 29(విజయక్రాంతి): మోదీ ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు నివ్వడం దుర్మార్గమని, దీంతో  దేశంలోని రైతులు ముఖ్యంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు.

హైదరాబాద్ లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా  సమావేశంలో ఆప్ రాష్ట్ర నేతలు బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, హేమ జిల్లో జు, శివాజీ, దర్శనం రమేష్, రాకేష్ రెడ్డి లతో కలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ పత్తి దిగుమతి సుంకంపై మినహాయింపును 2025 డిసెంబర్ 31 వరకు పొడిగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేసారు.

ట్రం ప్ మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధించడం ఫలితంగా మన దేశీయ పరిశ్రమలన్నీ మూతపడే దశలో ఉన్నాయని, ఎగుమతులన్నీ ఆగిపోయాయని, మన రైతులు, మన పారిశ్రామికవేత్తలు, మన వ్యా పారులను ట్రాంప్, మోదీ ఇద్దరు కలసి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పత్తి రైతులను ఆదుకు నేందుకు ఆప్ అధినేత అరవింద కేజ్రీవాల్ నేతృత్వంలో  సెప్టెం బర్ 7న గుజరాత్ రాష్ట్రంలో జరిగే పత్తి రైతుల సభకు తెలంగాణ రైతన్నలందరూ కదలి రావాలని విజ్ఞప్తి చేసారు. రా ష్ట్రంలో వరదల బీభత్సం వల్ల  వరదల్లో చి క్కుకొని మృతిచెందిన బాధిత కుటుంబాలకు, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఆదుకోవాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు.