30-08-2025 11:32:58 AM
హైదరాబాద్: తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది మంత్రులు.. కాంగ్రెస్ పార్టీ కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) అన్నారు. తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది కోర్టులు.. ప్రజలు అన్నారు. పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదంటే.. అధికారపక్షం భయపడుతున్నట్లేనని హరీశ్ రావు తెలిపారు. పీపీటీకి(PowerPoint Presentation) అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు. వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో(Telangana Assembly) పీపీటీ ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని లేఖ ఇచ్చామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. గతంలో తమకు పీపీటీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదని విక్రమార్క తెలిపారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ. 6,500 కోట్ల వడ్డీ కట్టట్లేదనే బీఆర్ఎస్ వాదన సరికాదన్న భట్టి విక్రమార్క వడ్డీలు బీఆర్ఎస్ నేతలు కడుతున్నారా? అని ప్రశ్నించారు.