30-08-2025 12:23:11 AM
కొండాపూర్, ఆగస్టు 29 : మల్కాపూర్ చెరువుకు నీటి ప్రవాహం పెరగడంతో అలు గు పొంగి పొర్లుతుందని, అలుగు తెగకుం డా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్రెడ్డి సూచించారు. శుక్ర వారం కొండాపూర్ మండల పరిధిలోని మ ల్కాపూర్ పెద్దచెరువును ఆర్డిఓ రవీందర్ రెడ్డి, డిఎస్పి సత్తయ్యగౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ చెరువు వద్ద భధ్రత సిబ్బందిని పెట్టాలని, నీటి ప్ర వాహం, అలుగు కాలువలకు గండి పడకుం డా నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. డిఎస్పి సత్తయ్యగౌ డ్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని, చెరువుల వద్దకు వెల్లకూడదన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆశోక్, డీఈ కాలగణేశ్, ఏఈ సుమంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.