calender_icon.png 30 August, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే సంప్రదాయం లేదు

30-08-2025 11:23:52 AM

హైదరాబాద్: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ(PowerPoint Presentation) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమకు పీపీటీకి అవకాశం ఇవ్వాలని లేఖ ఇచ్చామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. గతంలో తమకు పీపీటీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదని విక్రమార్క తెలిపారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ. 6,500 కోట్ల వడ్డీ కట్టట్లేదనే బీఆర్ఎస్ వాదన సరికాదు.. మరి వడ్డీలు బీఆర్ఎస్ నేతలు కడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం అయ్యాయి. సభలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. క్లాస్‌గా కనిపించే మాస్‌ లీడర్‌ గోపీనాథ్‌ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.