calender_icon.png 30 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి హైకోర్టుకు హరీశ్ రావు

30-08-2025 11:46:55 AM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission Report) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మరోసారి తెలంగాణ హైకోర్టును(Telangana High Court) ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని హరీశ్ రావు(Thanneeru Harish Rao) పిటిషన్ లో పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక సస్పెండ్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలని కోరారు. హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో హరీశ్ రావు హౌస్ మోషన్ పిటిషన్. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), హరీశ్ రావు పిటిషన్ వేశారు. పిటిషన్ల ఆధారంగా నోటీసులు జారీ చేసి హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు అక్టోబర్ 7న కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై తదుపరి విచారణ చేపట్టనుంది.