calender_icon.png 30 August, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్

30-08-2025 11:09:19 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అసెంబ్లీలో మాట్లాడుతూ... గోపీనాథ్ హైదరాబాద్ లో జన్మించి ఓయూలో విద్యాభ్యాసం చేశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానిగా గోపీనాథ్ రాజకీయాల్లో అడుగుపెట్టారని తెలిపారు. మొదట్నుంచి గోపీనాథ్ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారని సూచించారు. రెండుసార్లు కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు.

గోపీనాథ్( Maganti Gopinath) కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా యూరియా కోసం రైతన్నలను పండుగ రోజూ సైతం రోడ్ల మీద నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కేటీఆర్ ద్వజమెత్తారు. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న అవస్థలపై చర్చించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.