30-08-2025 10:29:59 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) డిమాండ్ చేశారు. వర్షాలు, వరదల వల్ల రైతులు పంటలు నష్టపోయారని కేటీఆర్ సూచించారు. ఎరువులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు యూరియా మాఫియా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల గురించి చర్చించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంపై చర్చించే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ పైనా చర్చ జరగాలన్నారు.
అనుకూల అంశాలు మాట్లాడుకోవడం కోసం కాదు అసెంబ్లీ సమావేశాలు.. మిమ్మల్ని ఇష్టారీతిన దూషించడం కోసం కాదు.. అసెంబ్లీ సమావేశాలు అన్నారు. ప్రజల సమస్యలు చర్చించి ప్రభుత్వం దృష్టికి తేవడానికి సమావేశాలని వివరించారు. అర్థవంతమైన చర్చకోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదు.. పీసీసీ కమిషన్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పీసీసీ కమిషన్ సహా అన్ని అంశాలపై తమ వైఖరి కుండ బద్దలు కొట్టినట్లు చెబుతామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల రైతులు పంటలు నష్టపోయారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై భారత రాష్ట్ర సమితి వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టింది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం వరకు.. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా”.. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి... “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.