calender_icon.png 30 August, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాస్‌గా కనిపించే మాస్‌ లీడర్‌ గోపీనాథ్‌

30-08-2025 10:50:38 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti Gopinath) మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సంతాప తీర్మాణం ప్రవేశపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) కు విశ్వాసపాత్రుడిగా గోపీనాథ్ కు సత్సంబంధాలు ఉండేవని తెలిపారు. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారని చెప్పారు. మాగంటి గోపీనాథ్ తనకు మంచి మిత్రుడు.. సన్నిహితుడనిని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్లాస్‌గా కనిపించే మాస్‌ లీడర్‌ గోపీనాథ్‌ అన్నారు. 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారని సీఎం తెలిపారు. గోపీనాథ్ అకాల మరణం ఆయన కుటుంబం, ప్రజలకు తీరని లోటు అన్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు.