calender_icon.png 30 August, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి బప్పా మోరియా... కావాలయ్య యూరియా!

30-08-2025 10:13:09 AM

హైదరాబాద్: గన్‌పార్క్‌ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs), ఎమ్మెల్సీలు నిరసన చేస్తున్నారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. యూరియా కొరత తీర్చి రైతులను ఆదుకోవాలని ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) దిగిపోవాలని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నేతలు ఆరోపించారు. ఈ ప్రభుత్వం పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టిందని మండిపడ్డారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా”.. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.