30-08-2025 11:35:39 AM
వచ్చిరాని వైద్యంతో రోగికి హైడోస్ సూది మందు.
కొద్దిసేపటికి కుప్పకూలిన మహిళ.
ఆర్.ఎం.పి ఆసుపత్రిలో వరుస ఘటనలు.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఓ ఆర్ఎంపి వైద్యుడు(RMP medical treatment) కాసులకు కక్కుర్తి పడి వచ్చిరాని వైద్యం చేయడంతో ఆ వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం యన్మనబెట్ల గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన సుభద్ర(60) శుక్రవారం మధ్యాహ్నం చాతినొప్పి ఉందని యన్మనబెట్ల గ్రామంలోని ఆర్ఎంపి ఆసుపత్రికి వెళ్ళింది.
అక్కడి వైద్యుడు డబ్బులకు ఆశపడి తన స్థాయికి మించిన వైద్యం చేస్తూనే పరిమితికి మించిన డోస్ యాంటీబయోటిక్ సూది మండు ఇవ్వడంతో కొద్దిసేపటికే మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆర్ఎంపి వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే ఆర్ఎంపి వైద్యుడు స్థాయికి మించిన వైద్యం చేసి పదుల సంఖ్యలో సామాన్యుల ప్రాణాలను బలిగొన్నాడని గ్రామస్తులు ఆరోపించారు.