calender_icon.png 18 August, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

18-08-2025 02:15:35 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్ర తి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చే స్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ అన్నారు.జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోగ సత్తెమ్మ,కోడిపల్లి నర్సమ్మ,జంగా సు జాత కు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల కు, గుట్రాజ్ పల్లి గ్రామంలో కొడికేల సుజాత ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మండలం లోని సంఘం పల్లి, సో మన్ పల్లి, అనంతారం, గుట్రాజ్ పల్లి,తిమ్మాపూర్,ధర్మారం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రు.82 లక్షలతో సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి,ధర్మా రం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రు. 17 లక్షలతో నిర్మించిన, అ దనపు తరగతి గదులను ,వంటగది,మరుగు దొడ్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రా రంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు పేద లందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.ఇందిరమ్మ రా జ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమథకాలు అందిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుందని,ఈ ని ధులను నాలుగు విడతల్లో ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని అన్నారు.

ఇంటి నిర్మాణం స్థలం కలిగి ఉన్న కుటుంబాలకు మొదటి విడతలో అందజేస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజురుచేస్తామని ఇండ్ల కోసం ఎవరు ఆం దోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మౌలిక సదుపాయాలు మెటీరియల్స్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌ లిక సదుపాయాలు కల్పించిన ఘనత ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేసి,ప్ర మోషన్ల కు పచ్చజెండా ఊపారని తెలిపారు. రాజకీయాల కతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము నాయక్,ఎమ్మెర్వో అరు ణ్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈఓ గాయత్రీ, ఏఈ రాజ మల్లయ్య,సీనియర్ నాయకులు ముస్కు ఎల్లారెడ్డి,మహేశ్వర్ రావు,బాలముకుందం,నక్కల రవీందర్ రెడ్డి,రౌతు గంగా ధర్ తదితరులు పాల్గొన్నారు.