calender_icon.png 18 August, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధ్దే లక్ష్యంగా ముందుకు వెళ్తాం

18-08-2025 02:14:18 AM

యూజీసీ, నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): బోయిన్‌పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్‌క్లేవ్, రాయల్ ఎన్‌క్లేవ్ కాలనీలలో శనివారం 39 లక్షల రూపాయలతో చేపట్టను న్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ పాల్గొ న్నారు. అనంతరం కాలనీలవాసులతో స మావేశమై వారి సమస్యలపై చర్చించారు.

వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయా లు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో కనీవినీ అభివృద్ధి జరుగబోతుందని చెప్పా రు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థా నిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.