calender_icon.png 20 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు జవాబు దారీగా ఉండాలి

20-12-2025 01:00:35 AM

కడ్తాల్, డిసెంబర్ 19 (విజయక్రాంతి ): నూతనంగా గెలుపొందిన సర్పంచులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ లు అన్నారు శుక్రవారం కర్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ సర్పంచ్ పాలకూర్ల కర్ణాకర్ గౌడ్ తన సోదరుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ తో కలిసి హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ వెంకట్ లను వేరువేరుగా  మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇటీవల గెలుపొందిన సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ వారు అభినందించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల్లోకి రాణించేందుకు యువతకు అవకాశాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా సర్పంచులు తమ వంతు కృషి చేయాలని వారు కోరారు.