16 July, 2026 | 12:05 AM

స్థానికంలో బీజేపీకి ఒక్కటీ రాదు

07-06-2024 02:43 AM

పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ 

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బీజేపీకి క్షేత్ర స్థాయిలో ఎలాంటి బలం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయిందని తెలిపారు. తెలంగాణలో మోదీ వేవ్ లేదని, బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలు మాత్రం ఉన్నాయన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలప డిందని, తెలంగాణలోనూ మరింత పుంజుకుంటుందన్నారు. బీజేపీ నుంచి ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా విజయం తర్వాత  ఢిల్లీకి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు.