29 March, 2026 | 1:21 AM

ఈ వారం వార్తల్లో..

29-03-2026 12:00 AM

హర్దీప్‌సింగ్ భరోసా !

పశ్చిమాసియా యుద్ధం భారత్‌పై ప్రభావం చూపుతున్నది. చమురు సంక్షోభం వస్తుందని దేశ పౌరులు ఆందోళన చెందుతున్న వేళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పరిణామాలను ప్రభుత్వం నిరంతరం గమనిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో చమురు సంక్షోభం రాదని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూస్తామని భరోసానిచ్చారు.

‘జననాయకుడి’ చిక్కులు!

తమిళ సినీ స్టార్, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి అసెంబ్లీ ఎన్నికల కంటే, తన ఆఖరి చిత్రం ‘జననాయకుడు’ విడుదల పెద్ద ప్రహసనంలా పరిణమించింది. చిత్రం ఇదిగో విడుదల.. అదిగో విడుదల అని ప్రేక్షకులు ఆశించడమే తప్ప, విడుదలపై ఏమాత్రం మంచి పరిణామాలు లేవు. అవాంతరాలు దాటుకుని సినిమా జూలైలోపు విడులవుతుందని బోగట్టా. అదైన జరుగుతుందో లేదో..దానికీ వేచి చూడాల్సిందే!