29 March, 2026 | 1:41 AM

రాగాలు పలికే రాళ్లు

29-03-2026 12:00 AM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా గుట్టలపై పలుచోట్ల రాగాలు పలికే అరుదైన రాళ్లను గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపా రు. ఈ రాళ్లను అరుదైన భూభౌతిక వారసత్వంగా సంరక్షించాల్సిన అవసరం ఉంద ని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానికులు వీటిని కంచు బండలుగా పిలుస్తున్నారు. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం డెక్కన్ ట్రాప్స్ ఏర్పడిన సమయం లో దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల పైకి వచ్చిన లావా గట్టిపడి బసాల్ట్ శిలలుగా మారింది.

ఈ ప్రక్రి యలో ఏర్పడిన కొన్ని శిలలు ఘన నిర్మా ణం కారణంగా శబ్ద తరంగాలను ప్రత్యేకంగా ప్రతిధ్వనింపజేస్తాయి. ఇటువంటి శిలలను శాస్త్రీయంగా లిథో ఫోన్స్ అని పిలుస్తారు. ఈ రాళ్లను మరొక రాయితో లేదా పనిముట్లతో కొట్టినప్పుడు కంచు మ్రోగినట్లుగా మధురమైన స్వరాలు వినిపిస్తాయి. అందువల్ల ఇవి రింగింగ్ స్టోన్స్ లేదా రాగాలు పలికే రాళ్లుగా ప్రసిద్ధి చెం దాయి. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి రాళ్లు ఉన్నాయి.

బాసర ఆలయం వద్ద వేద శిలగా పిలువబడే రాయి కూడా ఇలాంటి స్వరాలు పలికే బసాల్ట్ శిలగా భావిస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ ఖిర్మల్ గుట్ట పశ్చిమ వైపున ఉన్న రాళ్ల శ్రేణిలో ఒక పెద్ద రాయి కూడా స్వరాలు పలికే లక్షణం కలిగి ఉంది.

అయితే ఆ ప్రాంతానికి చేరుకోవడం ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు చేరుకోలేకపోతున్నారు.  ఈ అరుదైన రాళ్లను జియో-హెరి టేజ్ స్పాట్‌గా అభివృద్ధి చేసి సంరక్షించాలని తుమ్మల దేవరావ్ ప్రభుత్వాన్ని కోరా రు. ఈ ప్రత్యేక శిలలు నిర్మల్ జిల్లా చారిత్రక, భౌగోళిక ప్రాముఖ్యతను మరింతగా వెలుగులోకి తీసుకువస్తాయని ఆయన తెలిపారు. ఈ క్షేత్ర పర్యటనలో నేరెళ్ల హన్మంత్, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, దొంతుల భీమేష్ పాల్గొన్నారు.