2 September, 2026 | 11:14 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

మోదీపై అనుచిత వ్యాఖ్యలు సరికావు

01-09-2025 | 12:04am

నారాయణఖేడ్, ఆగస్టు 31:ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచమంతా విశ్వగురువుగా భావిస్తే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహులు గాంధీ ప్రతి సారి కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ అన్నారు.

నారాయణఖేడ్ మండల అధ్యక్షులు దశరథ్, పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రాజీవ్ చౌక్ లో నిరసన తెలిపి దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ మాట్లాడుతూ బీహార్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాహుల్ గాంధీ మోడీ తల్లిపై దుర్భాశలాడడం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోడీని ధైర్యంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, తల్లులపై విమర్శలు చేస్తున్న దమ్ములేని నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్, వివిధ మండల అధ్యక్షులు యెన్నాం అనిల్ రెడ్డి, శంకర్ రావు, మాజీ మండల అధ్యక్షులు కృష్ణ, అశోక్, సాగుణాకర్, పట్నం మాణిక్, మోర్చా అధ్యక్షులు భూంరాజ్, పవన్, దశరథ్,నవీన్, జ్ఞానేశ్వర, లోకేష్,సాయి తదితరులు పాల్గొన్నారు.