01-09-2025 12:05:28 AM
* తాత్కాలిక మరమ్మతులతో రవాణా పునరుద్దరణ
* భారీ ఎత్తున పంట నష్టం
* పటిష్ట చర్యలకు సిద్దమైన కలెక్టర్
మెదక్, ఆగస్టు 31(విజయక్రాంతి):మెతుకు సీమను అతలాకుతలం చేసిన భారీ వర్షాల వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగింది. జిల్లాలోని 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసి వరదలతో ముంచెత్తింది. రెండు మం డలాల్లో అతి భారీ వర్షం 30 సెం.మీటర్లు పడడంతో అతలాకుతలమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వర్షం తగ్గుముఖం పట్టగా జిల్లాలో రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తం భించి పోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ నేతృత్వంలో యంత్రాంగం పునరుద్దరణ చర్యలు చేపడుతుంది. మరోవైపు జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు తలమునకలవుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు జి ల్లాలో సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా భావిస్తున్నారు.
తాత్కాలిక రవాణా వ్యవస్థ...
ప్రకృతి విలయతాండవంలో భారీ వర్షా లు వరదలతో జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, రోడ్లు కల్వర్టులు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రవాణాను పునరుద్ధరించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రామాయంపేట, నిజాంపేట్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా రామాయంపేట నుండి సిద్దిపేట్ వెళ్లి జాతీ య రహదారి నిజాంపేట్ మండలం బ్రిడ్జ్ డామేజ్ ను పరిశీలించారు.
అనంతరం, నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలోని ప్రవాహానికి కొట్టుకపోయిన రెండు బ్రిడ్జిల ను,నిజాంపేట్ నుండి నస్కల్ వెళ్లి దారిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పురాతన బ్రిడ్జ్ లను రెవిన్యూ ఆర్ అండ్ బి అధి కారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రా మాయంపేట మండలం కాట్రియాల గ్రా మంలోని చెరువును మరియు పర్వతాపూర్ వెళ్లే దారిలో వరద ప్రభావానికి కొట్టుకుపోయిన బ్రిడ్జినిపరిశీలించారు.
130 గ్రామాల కు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని యు ద్ధ ప్రాతిపదికన అహర్నిశలు శ్రమించి విద్యు త్ను పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు. అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు చేయడం జరిగిందని వరద సహాయక చర్య ల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసిల్దార్ రజ ని, నిజాంపేట్ తహసిల్దార్, ఆర్‌అండ్ బి ఈ ఈ సర్దార్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.