మంత్రి ఉత్తమ్ పై అనుచిత వ్యాఖ్యలు తగదు
కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ..
కోదాడ: నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమం కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ(Congress leaders Rayapudi Venkat Narayana) అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లుగా మంత్రి ఉత్తంపై మాట్లాడడం సరికాదన్నారు. ఇదే విషయమై ఆదివారం హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ జలదోపిడికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంటే... రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పై విపక్ష పార్టీలైన బిజెపి టిఆర్ఎస్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.తక్షణమే మీ వాక్యాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.






