హరీష్ కుమార్ ను పరామర్శించిన ఇంద్రకన్ రెడ్డి
15-06-2025 | 08:38pm
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలం పొంగల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నేత డిసిసిబి డైరెక్టర్ సిహెచ్ హరీష్ కుమార్ కిడ్నాప్ అయి తప్పించుకోగా ఆదివారం మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) ఆయన్ను పరామర్శించారు. ఇంటికి వెళ్లిన ఇంద్రకరణ్ రెడ్డి జరిగిన ఘటనపై అన్ని వివరాలను అడిగి తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా డిసిసిబి చైర్మన్ ఏ భోజ రెడ్డి హరీష్ కుమార్ ను పరామర్శించారు.






