17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం

15-06-2025 08:32 PM

పదివేల నగదు బహుమతిని అందించిన హెడ్ కానిస్టేబుల్ దంపతులు..

పెన్ పహాడ్: పదవ తరగతిలో ఓ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దంపతులు రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందించి ఉన్నతంగా చదువుకోవాలని ప్రోత్సహించారు.  వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని దూపహడ్ గ్రామానికి బొల్లెపల్లి మల్లిఖార్జున్- మమత దంపతుల కుమార్తె బొల్లెపల్లి నిఖిల గ్రామం నుండి గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను సూర్యాపేటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన బోయిళ్ళ అరవిందు-శ్యామల దంపతులు పదివేల రూపాయల నగదు ప్రోత్సాహంగా అందించారు.

ఈ సందర్భంగా దాత అరవింద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి గ్రామంలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి ఈ బహుమతిని అందిస్తామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని గ్రామానికి వారి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, యువతి, యువకులు, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.