19 August, 2026 | 2:33 AM

ఫాంపాండ్ ప్రారంభం

19-08-2026 12:28 AM

జనగామ, ఆగస్టు18 (విజయక్రాంతి): వి బి జి రామ్ జీ పథకంలో భాగంగా నర్మెట్ట గ్రామంలో మంగళవారం ఫారం పాండ్ ప్రా రంభోత్సవ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పాతూరి బుచ్చిరెడ్డి భూ మిలో ఫారం పాండ్ పనులను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను పెంపొందించడంతో పాటు రైతులకు సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకు రావడంలో ఫారం పాండ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపా రు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ఉపాధి హామీ కూలీలు భాగస్వాములు కా వాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి, టీఏ, ఎఫ్‌ఏ, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.