24 April, 2026 | 5:49 AM

పాలన గాడి తప్పింది

27-06-2024 12:28 AM

బీఆర్‌ఎస్‌నేత దేవీ ప్రసాద్

హైదరాబాద్,జూన్ 26 ( విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు దాటినా హామీలు నెరవేర్చలేదని, రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని బీఆర్‌ఎస్‌నేత దేవీ ప్రసాద్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారే కానీ ప్రజల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్ల అప్పు చేసిందని.. 7 నెలల్లోనే పాలన పూర్తిగా గాడితప్పిందని దుయ్యబట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. రుణమాఫీ ఎవరికి చేయాలోనన్న క్లారిటీ ప్రభుత్వానికే లేదన్నారు. ఇక పోతే రైతు భరోసాకు ఎవరు అర్హులో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పట్లేదని, ఇదేం తీరని ప్రశ్నించారు.