ఇన్‌క్లూజివ్ రన్ మారథాన్ సూపర్‌హిట్
32వేల మందితో రికార్డు
శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (విజయక్రాం తి): హైదరాబాద్‌లో 15వ ఎన్‌ఎమ్డిసి మారథాన్-2026 అంగరంగ వైభవంగా సాగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ పరుగులో రికార్డు స్థాయిలో 32 వేల మంది రన్నర్లు ఉత్సాహ ంగా పాల్గొన్నారు.
5కే, 10కే, హాఫ్, ఫుల్ మా రథాన్లతో పాటు దివ్యాంగుల కోసం ‘ఇన్క్లూజివ్ రన్’ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఎన్‌ఎమ్డిసి డైరెక్టర్ కృష్ణకుమార్ ఠాకూర్, రేస్ డైరెక్టర్ రాజేష్ వెట్చా పరుగును ప్రారంభించారు. అంతర్జాతీయ ఎ లైట్ విభాగంలో ఇథియోపియా రన్నర్లు ఎ మానే సెయిఫు (మహిళలు), సెబోకా నెగు స్సే (పురుషులు) విజేతలుగా నిలవగా.. భార త్ తరఫున నర్మిబెన్ ఠాకోర్, గోపీ తోనకల్ సత్తా చాటారు. మూడేళ్లలో మారథాన్ను పూర్తిగా కార్బన్ రహితంగా మారుస్తామని నిర్వాహకులు వెల్లడించారు.






