31 August, 2026 | 1:33 AM

రెండు పడవల్లో ఒక కాలు..

31-08-2026 12:00 AM
  1. ఎమ్మెల్యే గాంధీపై మండిపడ్డ నవతారెడ్డి-
  2. పార్టీ గుర్తుపై గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ

శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (విజయక్రాం తి): తాను బీఆర్‌ఎస్లోనే ఉన్నానని పదేపదే చెబుతూ, కాంగ్రెస్ అంతర్గత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శేరిలింగంపల్లి ఎమ్మె ల్యే అరెకపూడి గాంధీ తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొ బ్బ నవతారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెం డు పార్టీల మధ్య ఊగిసలాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె ఎద్దే వా చేశారు. శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్లో కాంగ్రెస్ ఆధ్వర్యం లో ప్రత్యేక ఓటరు నమోదు శిక్షణ కార్యక్ర మం జరిగింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ని యోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫొటోలతో ఏర్పాటైన వేదికపై ఎమ్మెల్యే గాంధీ కనిపించడమే వివాదానికి కారణమైంది.ప్రతిపక్ష పదవి.. పాలకపక్ష వేదిక...ప్రతిపక్ష హోదాలో పీఏసీ చైర్మన్ పదవిని అనుభవిస్తూనే కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకోవడం దారుణమని నవతారెడ్డి అన్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్లోనే ఉన్నానని చెప్పుకోవడం, మరోవైపు కాంగ్రెస్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

స్వలాభం కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, శేరిలింగంపల్లి ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి కొమ్ము కాయడం ప్రజల తీర్పును తూలనాడడమేనని స్పష్టం చేశారు.రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి....ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన సమాధానం చెబుతారని నవతారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్లో చేరానని బహిరంగంగా ఒప్పుకొని, పీఏసీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.గాంధీ 2023లో బీఆర్‌ఎస్ టిక్పె గెలిచి, 2024లో కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడిగానే పీఏసీ అధ్యక్ష పదవిని కొనసాగిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరే నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారింది.