07-10-2025 12:15:03 AM
కొల్లాపూర్ అక్టోబర్ 6 :వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించేలా ముఖ్య నేత లు కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు అన్నారు, కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అమలు కానీ హామీలతో పాలన అస్తవ్యస్థoగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దళిత మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు జలాలు శివుడు, జిల్లా కార్యదర్శి తిరుమల్ యాదవ్, పట్టణ అధ్యక్షులు కాడం శ్రీనివాస్, కొల్లాపూర్ రూరల్ అధ్యక్షులు కేతురి నారాయణపాల్గొన్నారు.