07-10-2025 02:02:06 AM
బీసీ కోటాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
* హైకోర్టులో పిటిషన్ విచారణకు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? హైకోర్టులో స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా..?
సుప్రీం ధర్మాసనం
ఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ప్ర భుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. స్థాని క సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటి షన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివే సింది. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని సు ప్రీంకోర్టు పేర్కొంది.
50 శా తం పరిమితిని మించి రిజర్వేషన్లు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. అక్టోబర్ 8న హైకోర్టులో ఈ కేసు విచా రణ ఉన్న క్రమంలో తమ వాదనలను అక్కడే వినిపిం చాలని సూచిస్తూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిం ది. ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీ ప్ మెహతా ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేయడం శుభపరిణామమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటం చేసి సాధిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ , ఒక జీవోను ఇచ్చిన బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. హైకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
బీసీల పొట్ట కొట్టొద్దు : వీహెచ్
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. కొంత మంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను అడ్డుకునే ప్రయత్నం చేసి బీసీల పొట్ట కొట్టోద్దని ఆయన సూచించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, పార్టీ నేతలు లక్ష్మణ్‌యాదవ్, పలుగుల శ్రీనివాస్, నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో జరిగే విచారణలో తాను కూడా ఇంప్లీడ్ అయ్యానని వీహెచ్ తెలిపారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి : మంత్రి పొన్నం
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తాము ఆశిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు కోర్టులకు వెళ్లడం సరికాదన్నారు. జీవో 9కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేడయం మంత్రి పొన్నం హర్షం వ్యక్తంచేశారు.
హైకోర్టులో కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలకు కుల సర్వే నిర్వహించామని, అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ‘బీజేపీ అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకం. బీజేపీ ఒక ప్యూడలిస్టు పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. గతంలో రాంచందర్‌రావు హెచ్‌సీయూలో ఎస్సీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై చట్ట సవరణ బిల్లు, అర్డినెన్స్‌ను అడ్డుకుంటున్నదే బీజేపీ నేతలు.
రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆ పార్టీ నేతలు ఆమోదించి.. ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధ్ది ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను ఆమోదింప జేయాలి. శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు న్యాయ ప్రక్రియలోనూ సహకరించాలి ’ అని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. 42 శాతం రిజర్వేసన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని మంత్రి పేర్కొన్నారు.